విదేశీ విద్యకు అమ్మాయిలే … రికార్డు స్థాయిలో అమెరికాకు
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారని పలువురు వ్యక్తలు అన్నారు. 2022లో భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో 82,500 అమెరికా స్టూడెంట్ వీసాలు (ఎఫ్-1) వస్తే అందులో అత్యధికంగా అమ్మాయిలే ఉన్నారని తెలిపారు. టీహబ్ 2.0 సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫారెన్ స్టడీస్( ఐఎంఎఫ్ఎస్) ఆధ్వర్యంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెస్ట్-2023 నిర్వహించారు.
ఆరేడేళ్లుగా ఇండియా నుంచి విదేశీ విద్యకు వెళ్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతోందని, తల్లిదండ్రులు, పిల్లల ఆలోచనాతీరులో వస్తున్న మార్పే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన వందకుపైగా విశ్వవిదాలయాల ప్రతినిధులు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.













