ఫ్లోరిడాలో కాల్పుల కలకలం..

అమెరికాలోని తుపాకీ సంస్కృతి మరో సారి బుసలు కొట్టింది. దక్షిణ ఫ్లోరిడాలోని ఓ దుకాణంలో సాయుధ దుండగుడు జరిపిన కాల్పుల్లో చిన్నారి, మహిళ మృతి చెందారు. ఆ తరువాత దుండగుడు తనను తాను కాల్చుకున్నారు. ఉత్తర మియామీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయల్ పామ్ బీచ్ వద్ద ఉన్న పబ్లిక్స్ గ్రాసరీ స్టోర్‍లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికి ముగ్గురు బుల్లెట్ గాయాలతో చనిపోయి ఉన్నారని, వీరిలో షూటర్ కూడా ఉన్నారని తెలిపారు. ఫ్లోరిడాలో కాల్పులు జరగడం ఈ వారంలో ఇది రెండోసారి. ఆదివారం మియామీలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే.