యూకే ప్రధాని రేసులో రిషి సునాక్ ముందంజ!
యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రధాని రేసులో భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ ముందంజలో ఉన్నారు. ఈ పదవి కోసం తొమ్మిది మంది పోటీపడుతున్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన రిషి కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతలను పొందేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు. కొవిడ్ కాలంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తించిన సంగతిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భావి తరాల ప్రయోజనాలను కాపాడే నాయకత్వం అవసరం అంటూ అందులో పేర్కొన్నారు. తన నేపథ్యం, యూకే తమ కుటుంబాన్ని ఆదరించిన వైనాన్ని అందులో ప్రస్తావించారు. 80 నుంచి 100 మంది ఎపీలమ మద్దతునన్నట్లు తెలిపారు.
రిషికి సీనియర్ ఎంపీలైన హౌస్ ఆఫ్ కామన్స్ సభ నాయకుడు మార్క్ స్పెన్సర్, పార్టీ మాజీ చైర్మన్ ఒలివియఱ్ డౌడెన్, మాజీ మంత్రి లియామ్ు ఫాక్స్ మద్దతు పలికారు. కాగా, ఇప్పటి వరకు గట్టి పోటీదారుగా ఉన్న రక్షణ మంత్రి బెన్ వాలెస్ తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, భారతీయ మూలాలున్న అటార్నీ జనరల్ సుయెల్లా బ్రేవర్మూన్, టామ్ తుగెండట్ మాత్రం బరిలో ఉన్నారు. తాజాగా నైజీయిన్ సంతతికి చెందిన సమానత్వ శాఖ మాజీ మంత్రి కెవీ బదెనాచ్ తెరపైకి వచ్చారు. పరిశీలకులు మాత్రం రిషి సునక్ ప్రధాని రేసులో స్పష్టమైన ఆధిక్యంతో ఉన్నట్లు పేర్కొంటున్నారు. రిషి సునాక్ ఇప్పటికే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సెప్టెంబరులోగా కొత్త ప్రధానిని ఎన్నుకునే అవకాశం ఉంది.













