నాటోలో స్వీడన్ చేరికకు మేం ఒప్పుకోం
నాటో కూటమిలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న స్వీడన్‌కు తమ మద్దతు ఉండబోదని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ స్పష్టం చేశారు. స్టాక్‌హోమ్‌లో ఇటీవల ఇస్లామ్ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్సస్ పాలుదన్ అనే ఆందోళకారుడు పవిత్ర ఖురాన్ ప్రతిని కాల్చడాన్ని ఎర్దోగాన్ తప్పుపట్టారు. ఇది ముస్లింలు సహా అందరికీ అవమానకరమన్నారు. స్టాక్ హోమ్‌లో తుర్కియే రాయబార కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శనలకు స్వీడన్ అధికారులు అనుమతిచ్చారని దుయ్యబట్టారు. ఆ దేశంలో కుర్దిష్ వర్కర్స్ పార్టీ (పీకేకే) జెండాలను ప్రదర్శించడాన్నీ ఆయన తప్పుపట్టారు. తుర్కియేలో పీకేకను ఉగ్రవాద ముఠాగా పరిగణిస్తారు.













