మిసిసిపీ ఫెస్టివల్లో అపశ్రుతి
మిసిసిపీలో జరిగిన మడ్బగ్ ఫెస్టివల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మిసీసీపీ స్టేట్ ఫెయిర్ గ్రాండ్స్లో చోటు చేసుకుంది. ఈ మేరకు పీసీసీపీ అధికారి హిండ్స్ కౌంటీ షెరీఫ్ లైరీ జోన్స్ ఈ ఉత్సవంలో పలువురు గాయపడ్డారని వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఉత్సవంలో జరిగిన కాల్పుల్లో పాల్గొన్న వారిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫెస్టివల్లో ప్రత్యక్ష వినోదం, వంటల పోటీలు వినోద ఉద్యానవనాలు తదితరాలు ఉంటాయి. మిసీసీపీ బ్యూరో ఇన్వెస్టిగేషన్ స్థానికు సాయంతో దర్యాప్తును ముమ్మరం చేసింది.













