ఫ్రెంచ్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ బహుమతి
ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌కు ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ దక్కింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుమారు 30కి పైగా సాహిత్య రచనలు చేశారమె. 1940లో ఆమె నార్మెండీలోని యెవటోట్‌లో జన్మించారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ రచనలు చేస్తున్నారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ రచనలు చేస్తున్నారు. నోబెల్ బహుమతి తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇది నాకు చాలా పెద్ద గౌరవం. అలాగే గొప్ప బాధ్యత, నాకు లభించిన బాధ్యత. రచన అంటే ఓ రాజకీయ చర్య, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టడమే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాజ రచనలపై భాషను ఆమె ఓ కత్తిలా వాడుతున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగడతో రచనలు చేస్తున్నట్లు కమిటీ అభిప్రాయపడిరది. ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు.













