అమెరికన్ దళాలు వెనక్కి… అంతవరకు ఆ దేశానికి
అమెరికాపై తమ యుద్ధం కొనసాగిస్తామని అల్‌ఖైదా పేర్కొంది. ఆల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు సీల్ బృందం చేపట్టిన ఆపరేషన్‌కు పదేళ్లు నిండిన సందర్భంగా ఆల్‌ఖైదా ప్రతినిధులు మాట్లాడారు. గత 19 ఏళ్ళుగా ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దాడులను తిప్పికొడుతున్న తాలిబన్లను అల్‌ఖైదా ప్రతినిధి ప్రశంసించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచే కాదు, మిగతా ఇస్లామిక్ దేశాల నుండి కూడా అమెరికన్ దళాలు వెనక్కి వెళ్లాలి. అంతవరకు ఆ దేశానికి వ్యతిరేకంగా పోరు సాగిస్తామన్నారు. ఆల్‌ఖైదా ప్రతినిధులతో మాట్లాడామని సీఎన్ఎస్ చెబుతున్నదాన్ని మీడియా సంస్థలు నిర్ధారించలేదు. తన సొంత గెరిల్లా నెట్‌వర్క్‌ల ద్వారా లేదా ఆడియో, వీడియో టేప్‌ల ద్వారా ప్రకటనలు జారీ చేస్తూ ఉంటుంది. పాశ్చాత్య మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఆల్‌ఖైదా తిరస్కరిస్తుంది.













