ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే.. మెదడుకు
ప్రతి రోజు ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు పనితీరు మెరగవుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. కాఫీ కెఫిన్‌ను మించి బ్రెయిన్‌కు ప్రత్యేకమైన బూస్ట్ ఇస్తుందని తెలిపింది. కాఫీ తాగడం వలన కలిగే లాభాలు, ప్రభావాలను సాధా కెఫిన్ పాక్షికంగా మాత్రమే కలిగిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కాఫీ సేవించడం వలన మెదడులో చురుకుదనాన్ని పెంచడమే కాకుండా, జ్ఞాపకశక్తి, లక్ష్య నిర్దేశిత ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుందని, దృష్టిని నియంత్రించే మెదడులోని నరాల నెట్వర్క్ కనెక్టివిటీని పెంచుతుందని తెలిపారు.













