అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
అమెరికాలో కాల్పుల మోత ఆగడం లేదు. ప్రతి క్షణం ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తుపాకీ కల్చర్ వల్ల ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందోనని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా అమెరికాలో టెక్సాస్‌లో ఒక దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడంతో ఐదురుగు ప్రాణాలు పోయారు. క్లీన్‌లాండ్ ప్రదేశంలో ఒక వ్యక్తి ఐదుగురిపై కాల్పులు జరిపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. మృతులలో ఎనిమిది సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. రైఫిల్ షూటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా అక్కడ ఉన్నవారు అభ్యంతరం తెలిపారు. ఇంట్లోని వారు నిద్ర పోతున్నారని, శబ్దాలు చేయవద్దని అక్కడ ఉన్న మహిళలు కూడా వారించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి తుపాకీతో పొరుగింటి వారిపై కాల్పులు జరిపాడు. ఆ వ్యక్తి దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో అక్కడ ఉన్నవారు తప్పించుకోలేకపోయారు. కాల్పుల సమయంలో ఆ ఇంట్లో 10 మంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అమెరికాలో ఇప్పటి వరకు 174 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్లు పొలీసులు తెలిపారు.













