పది మంది ప్రవాస భారతీయలకు పురస్కారాలు
హిందువుల సంస్కృతిని పరిరక్షించడంతో పాటు వారికి ఉత్తమ సేవలు అందించిన పది మంది భారతీయ అమెరికన్ లకు సముచిత రీతిలో సత్కారం లభించింది. స్వచ్ఛంద సంస్థ హిందూస్ ఫర్ గ్రేటర్ హ్యూస్టన్ (హెచ్జీహెచ్) వారికి అవార్డులు ప్రకటించింది. భారతీయులకు గుర్తింపు తీసుకురావడంలో, హిందూ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రచారం చేయడంలో అవార్డు గ్రహీతలు కృషి చేయగలరని మోదీ ఆకాంక్షిస్తూ వారికి అభినందనలు తెలిపారని హెచ్జీహెచ్ తెలిపింది. ఈ నెల 19న పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్జీహెచ్ ప్రవాసులకు అవార్డులు అందజేసింది.
అనీష్ నాయక్(సేవా ఇంటర్నేషనల్), అనూష సత్యనారాయణన్(ఎటర్నల్ గాంధీ మ్యూజియం ఆఫ్ హ్యూస్టన్), నిత్య రామన్కులంగర (శ్రీమీనాక్షి టెంపుల్ సొసైటీ), సందీప్ ప్రభాకర్ (గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ డివినిటీ), కృతి పటేల్ (బీఏపీఎస్), విపశ్చిత్ నందా (ఆర్యసమాజ్), అభిమన్యు అగర్వాల్ (హిందూ హెరిటేజ్ యూత్ క్యాంప్), రంజిత్షా (వల్లభ్ విద్యామందిర్)లకు భారత కాన్సుల్ జనరల్ అసీమ్ మహాజన్ అవార్డులు అందజేశారు.













