వ్యాక్సిన్ ల పేటెంట్ రద్దుపై… ప్రపంచ బ్యాంక్

కరోనా వైరస్ వ్యాక్సిన్ లపై పేటెంట్‍ను ఎత్తివేయాలనే ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ వ్యతిరేకిస్తోంది. దీని వల్ల ఔషధ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు విఘాతం కల్గుతుందంటూ ప్రపంచ బ్యాంక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే కొవిడ్19 వ్యాక్సిన్‍పై మేధో సంపత్తి హక్కులను ఎత్తేయాలనే ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అదికార యంత్రాంగం, ఇతర ధనిక దేశాలు కూడా స్వాగతించాయి. అయితే దీని వల్ల కొత్త పరిశోధనలు అవిష్కరణలకు విఘాతం కల్గుతుందంటూ ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్‍పాస్ వ్యతిరేకత వ్యక్తం చేశారు.