అమెరికా లో మూడవ వంతు రాష్ట్రాలు రెడ్ జోన్
అమెరికా లో శుక్రవారం 17 జూలై నా 70,000 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇది రెండవ అత్యధిక రోజువారీ రికార్డు. గురువారం 16 జూలై నా 75600కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ఇప్పటిదాకా ఇదే అత్యధిక రోజువారీ రికార్డు అని తెలిసింది.
వైట్ హౌస్ లో కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ ప్రచురించని నివేదిక ప్రకారం ఈ రాష్ట్రాలలో వెల్లడించని కరోనా వైరస్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదు ఐనా 70,000 కేసులులో మూడోవంతు అంటే షుమారుగా 24000 ఉన్నాయి అని న్యూయార్క్ టైమ్స్ వివరించింది. ఈ మేరకు అమెరికా లోని 18 రాష్ట్రాలని “అలబామా, అరిజోనా, అర్కాన్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, ఇడాహో, అయోవా, కాన్సాస్, లూసియానా, మిస్సిస్సిప్పి, నెవాడా, నార్త్ కరోలినా, ఓక్లహోమా, సౌత్ కరోలినా, టేనస్సీ, టెక్సాస్ , ఉటా మరియు సన్ బెల్ట్ ” రెడ్ జోన్ గా ప్రకటించాలి అని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది.
పెరుగుతున్న కరోనా వైరస్ దృష్ఠ్య అర్కాన్సాస్ గవర్నర్ ఆస హాచిన్సన్ మరియు కొలరాడో గవర్నర్ జారెడ్ పొలీస్ జూలై 16 గురువారం మాస్క్ తప్పనిసరి అని ఉత్తర్వు జారీ చేశారు, కానీ మాస్క్ వ్యక్తిగత అవసరాలకు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు గాను భావిస్తూ కొంతమంది రిపబ్లికన్ నాయకులతో సహా అనేక వర్గాల నాయకులు గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. శరదృతువులో విద్యాసంస్థలు తప్పక తెరవాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలు ఆన్లైన్ ద్వారా క్లాసెస్ ప్రారంభించటానికి ప్రణాళికను రూపొందిస్తున్న సంమయంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్నానీ గురువారం 16జూలై న ట్రంప్ ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ ” ట్రంప్ ఓపెన్ అని చెప్పినప్పురు అంటే పూర్తిగా తెరవాలి అని అర్ధం”, పిల్లలు వారి విద్యాసంస్థలులో ప్రతిరోజూ హాజరుకావాలి. ఆన్లైన్ క్లాసెస్ విధానం సైన్స్ కి పనికిరాదు” అని అన్నారు.






