నవంబరు 1 కల్లా వచ్చేస్తుంది : అమెరికా
కరోనా వైరస్ టీకా (వ్యాక్సిన్) పంపిణీకి నవంబరు 1 నాటికి సర్వసన్నద్ధంగా ఉండాలంటూ రాష్ట్రాల గవర్నర్లకు అమెరికాలోని రోగ నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వర్తమానం పంపింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆగస్టు 27న రాష్ట్రాల గవర్నర్లకు రాసిన లేఖ తాజాగా మీడియాకు చిక్కింది. అధీకృత ఔషధ పంపిణీ సంస్థ మెకెసన్ కార్పొరేషన్ నుంచి త్వరలో అనుమతులు, రానున్నాయనీ, రాష్ట్ర, స్థానిక ఆరోగ్య విభాగాలకూ, ఆసుపత్రులకూ టీకాను చేరవేసే విషయమై ఇప్పటికే ఆ సంస్థ తమను సంప్రదించిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు తరుముకొస్తున్నందునే టీకా పంపిణీని ప్రభుత్వం ఆదరాబాదరాగా చేపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. టీకాపై మూడోదశ క్లినికల్ పరీక్షలు ఇంకా పూర్తీకాకుండానే నవంబరు 1 గడువును నిర్దేశిస్తూ సీడీసీ సూచనలు జారీ చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.






