ప్లాస్మా థెరపీ పై అమెరికా కీలక నిర్ణయం..
మహమ్మారి కరోనా బారిన పడిన వారి పాలిట వరంగా పరిగణిస్తున్న ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిలిపివేసింది. ఈ చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ క్లినికల్ డైరెక్టర్ హెచ్, కిఫార్డ్ లేన్ మాట్లాడుతూ ప్లాస్మా థెరపీపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత సమీప భవిష్యత్తులో అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఈ చికిత్స ద్వారా ఎంత మంది కోలుకున్నారని, ఏ మేరకు సత్ఫలితాలు లభించాయన్న వివరాలపై సృష్టత లేనందున అనుమతులు నిలిపివేసినట్లు భావిస్తున్నామన్నారు.






