కొవిడ్ చికిత్సకు.. మరో ఔషధం

మోల్నుపిరవిర్ 200 ఎంజీ కేప్సూల్స్ తరహాలోనే కొవిడ్-19 వ్యాధి చికిత్స కోసం మరో ఔషధం పాక్స్‌లోవిడ్ త్వరలో అందుబాటులోకి రానుంది. బహుళజాతి సంస్థ అయిన ఫైజర్ అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని కొవిడ్ చికిత్సలో వినియోగించడానికి ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లలో అనుమతి లభించింది. ఐక్యరాజ్యసమితి మద్దతు గల మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ), ఫైజర్‌తో స్వచ్ఛంద లైసెస్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ఈ మందు ఉత్పత్తి చేసే కంపెనీలతో ఎంపీపీ, సబ్ లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. దీంతో వివిధ దేశాలు ఫైజర్ నుంచి పాక్స్‌లోవిడ్ మందు కొనుగోలుకు కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి.