రూ.225 కే కోవిడ్ వ్యాక్సిన్
ప్రముఖ టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, వ్యాక్సిన్ అలయన్స్ అయిన గవితో నూతన భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తయారీ సామర్థ్యం పెంపుతోపాటు 10 కోట్ల కోవిడ్ 19 వ్యాక్సిన్లను భారత్తో పాటు తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు సరఫరా చేస్తామని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్ రూ.1.125 కోట్ల నిధులను గవికి అందజేస్తుంది. ఈ నిధులను సీరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ తయారీకి, వ్యాక్సిన్ల సరఫరాకు వెచ్చిస్తారు. ఒక్కో డోస్ గరిష్ట ధరను రూ.225 గా సీరమ్ ఇన్స్టిట్యూట్ నిర్ణయించింది. అన్ని అనుమతులు రాగానే 2021 తొలి అర్ధ భాగంలోనే సరఫరా చేస్తామని తెలిపింది.






