ఆగస్టు 12న తొలి కరోనా వ్యాక్సిన్!
రష్యా నుంచి ఆగస్టు 12న తొలి కరోనా టీకా విడుదల కానున్నట్లు ఆ దేశ ఉప ఆరోగ్య మంత్రి ఒలేగ్ గ్రిడ్నెవ్ తెలిపారు. ఉఫా నగరంలో క్యాన్సర్ సెంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. టీకాను గమలేయ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని ఆయన పేర్కొన్నారు. గమలేయ ఇన్స్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్‌లో ఉంది. ఈ దశ ట్రయల్స్ చాలా ముఖ్యమైనది. వైరస్ బారినపడిన వారిలో రోగ నిరోధక శక్తి పెరిగితే టీకా సురక్షితమని అర్థం చేసుకోవాలి అని ఒలేగ్ గ్రిడ్నెవ్ సృష్టం చేశారు. తొలిదశలో వైద్య నిపుణులు, సీనియర్ సిటిజన్లు టీకాలు వేస్తామని చెప్పారు. టీకా క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభమయ్యాయని, 38 మంది వాలంటీర్లకు టీకా ఇవ్వగా వారందరిలో రోగనిరోధక శక్తి పెరిగిందని ఆయన వెల్లడించారు.






