రష్యా నుంచి కరోనాపై తొలి వ్యాక్సిన్ విడుదల
కరోనా వైరస్‌కు రష్యా వ్యాక్సిన్‌ను కనుగొందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. రష్యా ఆరోగ్య శాఖ ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. మాస్కోకు చెందిన గమేలియా ఇన్స్టిట్యూట్ ఆ టీకాను అభివృద్ధి చేసింది. త్వరలోనే ఆ టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. కరోనా వైరస్ సోకిన తన కూతురికి ఆ టీకాను ఇచ్చినట్లు పుతిన్ వెల్లిడించారు. ఈ వ్యాక్సిన్‌ను మొట్టమొదటగా తన కుమార్తెకే ఉపయోగించినట్లు పుతిన్ తెలిపారు. రెండు నెలలపాటు మనుషులపై ఈ వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతున్నాయని పుతిన్ తెలిపారు. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.






