ప్రపంచ దేశాలకు అమెరికా భారీ సాయం…

ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్ టీకా డోసులు అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‍తో పాటు ఫైజర్ బయో ఎన్‍టెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్స్ టీకాలు సైతం వచ్చే ఆరు వారాల్లో అందించనున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే టీకాల్లో ఈ మొత్తం 13 శాతం కాగా ఇప్పటివరకు రష్యా, చైనా, ప్రపంచ దేశాలకు సరఫరా చేసినదానికంటే 5 రెట్లు ఎక్కువని బైడెన్ వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంటే, అమెరికా సైతం క్షేమంగా ఉండలేదని పేర్కొన్నారు. వచ్చే ఆరు వారాల్లో 80 మిలియన్ల టీకా డోసులు ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని తెలిపారు.