న్యూయార్క్ లో ఒమిక్రాన్ ఉద్ధృతి

అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతి తీవ్రంగా ఉంటోంది. న్యూయార్క్ నగరం పిల్లల ఆస్పత్రుల్లో కొవిడ్‌తో సంబంధం ఉన్న కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ హెచ్చరించింది. డిసెంబర్ 5న ప్రారంభమైన వారం నుంచి ప్రస్తుత వారం వరకు 18 ఏళ్ల లోపు వారిలో కొవిడ్ సంబంధిత ఆస్పత్రి చేరికలు నాలుగు రెట్లు పెరిగాయి. వారిలో దాదాపు సగం మంది ఐదేళ్ల కంటే తక్కువ వయసు వారేనని వెల్లడిరచారు. ప్రస్తుతం ఐదేళ్ల లోపు వారు టీకా తీసుకునేందుకు అర్హులు కారని గుర్తు చేసింది. ఇప్పటి అమెరికాలో డెల్టాను అధిగమించి ఒమిక్రాన్ విస్తరిస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం సీడీసీ వెల్లడించింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో డెల్టా కేసులు 27 శాతానికి పడిపోగా, 73 శాతం ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు వెల్లడిరచింది.