వారు మాట్లాడడం వల్లే ఎక్కువగా… వైరస్ బారిన

కరోనా సోకినవారి తుమ్ము, దగ్గు వల్ల ఇతరులు వైరస్ బారిన పడే ముప్పు ఎక్కువని అనుకుంటున్నాం. కానీ వారు మాస్కు లేకుండా మాట్లాడడం వల్లే ఇల్లు, కార్యాలయం వంటి చోట్ల (ఇన్‍డోర్స్) కరోనా ఎక్కువగా వ్యాపిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. మాట్లాడేటప్పుడు ఏయే పరిణామాల తుంపరలు వెలువడతాయి. ఏ తుంపరలో ఏ స్థాయి వైరల్ లోడ్ ఉంటుంది తదితర అంశాలను ఇందులో గుర్తించారు. కొవిడ్ పేషెంట్లు మాస్కు లేకుండా మాట్లాడేటప్పుడు వారి నోటీ నుంచి వెలువడే మధ్యస్థాయి తుంపరలు ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే ఆలి గాలిలో ఎక్కువ సేపు ఉంటాయట.