వచ్చే నెలలో భారత్ కు.. జాన్సన్ అండ్ జాన్సన్

జులై నెలలో అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా భారత్‍లో అందుబాటులోకి రానుంది. అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఇండియా) ఈ వ్యాక్సిన్‍ను ప్రైవేటుగా ఆ సంస్థ నుంచి నేరుగా సేకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో తొలుత కొన్ని వేల డోసులు మాత్రమే రానున్నట్టు సమాచారం. సింగిల్ షాట్ వ్యాక్సిన్ ధర 25 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఫ్రోజెన్ స్టోరేజీ అవసరం లేదు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే అయిన ఇండియా లాంటి దేశాలకు ఇది పూర్తిగా అనువైనది.