అమెరికా యువతకు ఉచితంగా… బీర్!

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం (జులై 4వ తేదీ) నాటికి దేశం లోని 70 శాతం వయోజనులకు టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యాన్ని చేరుకొనేందుకు రకరకాల ప్రోత్సాహకాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేసుకున్న వారికి నగదు, క్రీడల టికెట్లు, వేతనంతో కూడిన సెలవులు వంటివాటిని అందజేస్తామంటూ పలు కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే, పానీయాలు తయారు చేసే అన్‍హై జర్ బుష్ అనే కంపెనీ.. 21 ఏళ్ల పైబడిన యువతను దృష్టిలో ఉంచుకొన్ని కొత్త ఆఫర్‍ను ప్రకటించింది. టీకా వేయించుకొని తమ వెబ్‍సైట్‍లో పేర్లు నమోదు చేసుకునే తొలి 2 లక్షల మందికి ఒక్కొక్కరికి 5 అమెరికన్ డాలర్ల (రూ.350) విలువైన బీర్‍ను ఉచితంగానే ఇస్తామని ప్రకటించింది.