టీకా వేయించుకోవడం మీ ఇష్టమే…తప్పనిసరికాదు

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు తెచ్చిన వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న నిబంధన ఏదీ ఉండబోదని, ఎవరికి ఇష్టమైన వాళ్ళు వారు వ్యాక్సిన్ వేసుకోవచ్చని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తాను మాత్రం బహిరంగంగా అందరి ముందు టీకా తీసుకుంటానని తెలిపారు. మాస్కులు ధరించడం కూడా తప్పనిసరి చేయబోనని కూడా వెల్లడించారు. అయితే, మహమ్మారి నుంచి రక్షించుకోవాంటే మాస్కు ధరించడం అత్యసరమని.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తానన్నారు. కాగా మరోవైపు టీకా అందరికీ ఉచితంగా అందజేయడంతో పాటు తర్వాత ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తినా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. మాస్కు ధరించడం, అదే సమయంలో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుండడంతో మరణాలు, కొత్త కేసులు భారీ ఎత్తున తగ్గిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనతో పాటు, ముగ్గురు మాజీ అధ్యక్షులు బహిరంగంగా టీకా తీసుకోనున్నారని తెలిపారు.