ఇండియా లో కరోనా వైరస్ వ్యాక్సిన్ భారీగా ఉత్పత్తి
భారతదేశంలోని సంపన్న కుటుంబాలలో ఒకటి అయిన ఆధార్ పూనావాళ్ళ కుటుంభం నడుపుతున్న ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థలలో ఒకటి సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా, పూణే కి 2020 మే నెలలో అత్యంత భద్రంగా డ్రై ఐస్ తో కట్టుదిట్టంగా ఒక స్టీల్ బాక్స్ లో ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్ నుంచి చిన్న గాజు బుడ్డి లో పరీక్షల్లో ఉన్న 1-మిల్లీలీటర్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చింది. సీరం సంస్థ శాస్త్రవేత్తలు వచ్చిన వ్యాక్సిన్ తో బిలియన్ల కణాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ప్రపంచంలోని COVID-19 ని అంతం చేసే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ జూదాలలో ఒకటిగా ఈ చర్యను గుర్తించినట్టు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.
ఎందుకు అంటే ఆక్స్ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇంకా ప్రయోగ దశలోనే ఉండగా వ్యాక్సిన్ను వేల సంఖ్య మోతాదులో తయారుచేయటాన్ని తప్పు పట్టినటు న్యూ యార్క్ టైమ్స్ వివరణ ఇచ్చింది. అయితే 39 ఏళ్ల అదార్ పూనవల్లా, ఖచ్చితంగా “70 నుండి 80%” ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని , తాను ఉత్పత్తి చేసే వందల మిలియన్ల వ్యాక్సిన్ మోతాదులలో సగం భారతదేశలో సగం ప్రపంచంలోని ఇతర దేశాల మరియు పేద దేశాల కి విక్రయిస్తారు అని తెలుపుతూ మోడీ ప్రభుత్వం దీనిపై అభ్యంతరం చెప్పలేదని పూనవల్లా చెప్పినట్టు తెలిసింది.






