తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం 34,426 మందికి పరీక్షలు నిర్వహించగా 1,417 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. జీహెచ్ఎంసీ పరిధిలో 264 మందికి కొత్తగా కరోనా సొకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే వైరస్ బారిన పడిన 13 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 974కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1,58,153కి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వైరస్ సోకిన వారిలో నిన్న మరో 2,479 మంది కోలుకోవడంతో కరోనాను జయించిన వారి సంఖ్య 1,27,007 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,532 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. మరో 23,639 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.






