తెలంగాణలో కొత్తగా 1,802 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 1,802 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కు చేరాయి. వైరస్ ప్రభావంతో తాజా 9 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 895కు చేరింది. వైరస్ నుంచి కొత్తగా 2,771 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 1,10,241 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 31,635 యాక్టివ్ కేసులున్నాయి. 24,596 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 245, రంగారెడ్డిలో 158, కరీంనగర్ 136, సిద్దిపేటలో 106, సంగారెడ్డిలో 103 మందికి కరోనా సోకిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఆదివారం 36,593 టెస్టులు చేయగా, 17,66,982 పరీక్షలు చేశామని, ఇంకా 1,759 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని వివరించింది.






