తెలంగాణలో కొత్తగా 1,102 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 1,102 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,44,555 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 91,361కి చేరింది. తాజాగా ఒక్కరోజే 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 693కి చేరినట్టు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,542 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కరోనా నుంచి 1,930 కోలుకోగా, మొత్తంగా ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 68,126కి చేరింది.కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 234, కరీంనగర్ 101, రంగారెడ్డి జిల్లాలో 81, వరంగల్ అర్బన్ జిల్లాలో 70, మేడ్చల్లో 63 కేసులు నమోదయ్యాయి.






