తెలంగాణలో 90 వేలకు పైగా కరోనా కేసులు
తెలంగానలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1863 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 90,259కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 10 మంది మృతి చెందగా, మరణాల సంఖ్య 684కు పెరిగింది. కరోనా నుంచి కొత్తగా 1912 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 66,196 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల విషయానికి వస్తే, గ్రేటర్ హైదరాబాద్లో 394, మేడ్చల్ 175, రంగారెడ్డి 131, కరీంనగర్ 104, వరంగల్ అర్బన్ 101 కరోనా కేసులు నమోదయ్యాయి.






