తెలంగాణలో కొత్తగా 1,256 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా ఉదృతి కొసాగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరింది. మరోవైపు 10 మంది కొవిడ్‌తో మృతి చెందగా, ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 637కి పెరిగింది. నిన్న 1,587 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 389, రంగారెడ్డి లో 86, కరీంనగర్లో 73 కేసులు ఉన్నాయి.






