తెలంగాణలో కొత్తగా 1,982 మందికి పాజిటివ్
తెలంగాణలో తాజాగా మరో 1,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,495కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం నాటి బులిటెన్లో వెల్లడించారు. గడచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 627కి పెరిగింది. వివిధ ఆస్పత్రుల నుంచి 1,669 మంది డిశ్చార్జి కావడంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 55,999కి చేరింది. రాష్ట్రంలో 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 463 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.






