ఆంధప్రదేశ్ లో కరోనా విజృంభణ…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 76,465 శాంపిల్స్‌ను పరీక్షించగా 9901 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,27,593 శాంపిల్స్ పరీక్షించగా.. 5,47,587 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటికే 4,57,008 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 4846 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 95,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,292 మంది డిశ్చార్జి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 1398 పాజిటివ్ కేసులు రాగా, పశ్చిమగోదావరి జిల్లాలో 1069 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 1146, చిత్తూరు జిల్లాలో 932 చొప్పున కొత్త కేసులు వచ్చాయి.
కడప జిల్లాలో కొత్తగా మరో తొమ్మిది మంది కరోనాకు బలికాగా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఎనిమిది మంది, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మృతి చెందారు.






