ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా ఎనిమిదో రోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 62,225 నమూనాలను పరీక్షించగా వారిలో 10,199 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 4,65,730కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజులో 75 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, చిత్తూరు 9, గుంటూరు 9, అనంతపురం 7, కృష్ణా 7, పశ్చిమగోదావరి 7, నెల్లూరు 6, కడప 5, కర్నూలు 4, శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. తాజా వివరాలతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,200కి చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 9,499 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,05,775 నమూనాలను పరీక్షించారు.






