ఆంధప్రదేశ్ లో కరోనా విజృంభణ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 55,551 మందికీ పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజులోనే 95 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,001కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరులో 16, ప్రకాశంలో 11, నెల్లూరులో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరిలో 8, పశ్చిమగోదావరిలో 8, కడపలో 7, గుంటూరులో 6, కర్నూలులో 6, విశాఖపట్నంలో 6, శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 4, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో 8,846 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు బులెటిన్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,74,847 కరోనా పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.






