ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,652 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,06,261కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 88 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,820కి చేరింది. మరోవైపు 2,18,311 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేఉలు ఉన్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో 56,090 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు 28.61 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులిటెన్లో పేర్కొంది.






