ఏపీలో 8,012 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్రంలో కొత్తగా 8,012 మందికి కొవిడ్ ఉన్నట్లు నిర్ధారణైంది.ఈ మహమ్మారి బారిన పడి 88 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి, మరణాల సంఖ్య 2,650కి చేరాయి. 24 గంటల్లో 48,746 నమూనాలు పరీక్షించగా, 16.43 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. కొత్తగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 981 పశ్చిమగోదావరిలో 893, తూర్పుగోదావరిలో 875 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తంగా పాజిటివిటీ రేటు 10.13కు చేరింది.






