ఏపీలో రెండున్నర లక్షలు దాటిన కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు రెండున్నర లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 9,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,54,146 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,425 యాక్టివ్ కేసులు ఉండగా, 1,61,425 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొంది. ఒక్క రోజులో 6,676 మంది కోలుకున్నారని వెల్లడించింది. గత 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా, ఇప్పటివరకు మొత్తం 26,49,767 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజాగా మరో 93 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో 13 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో 10 మంది, శ్రీకాకుళం, జిల్లాలో 9 మంది, అనంతపురం, కడప జిల్లాల్లో 7 మంది, విశాఖ పట్నంలో 6 మంది, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో 5 మంది, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,296కి చేరింది.






