ఏపీలో కొత్తగా 10,820 కేసులు నమోదు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,097 మంది కరోనా నుంచి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,38,712కి చేరడంతో పాటు రికవరీ రేటు 60.88 శాతానికి పెరిగింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 62,912 మందికి పరీక్షలు నిర్వహించగా 10,820 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,860కు చేరింది. మరో 97 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 2,036కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 87,112.






