ఏపీలో 7,813 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 7,813 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 88,671కి చేరింది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 52 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 985కి చేరింది. తాజాగా గుంటూరులో 9 మంది, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 6, చిత్తూరులో 5, విజయనగరంలో 4, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 3, నెల్లూరు, ప్రకాశంలో ఒక్కొక్కరు చొపున ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,95,674 మందిని పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 43,255 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా… మరో 44,431 మంది వివిధ కొవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు బులిటెన్లో పేర్కొంది.






