ఏపీలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 6045 పాజిటివ్ కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా, కృష్ణా జిల్లాలో 10, పశ్చిమ గోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 5 చొప్పున, విజయనగరం జిల్లాలో 4, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో చెరో ముగ్గురు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అలాగే, ఈ రోజు కొత్తగా 6494 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 64,713కి పెరిగింది. వీరిలో 823 మంది ప్రాణాలు కోల్పోగా, 32,127 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,763 యాక్టివ్ కేసులు ఉన్నాయి.






