వ్యాక్సిన్ సరఫరాలో భారతే కీలకం
ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేయటంలో భారత్ కీలకపాత్ర పోషించనుందని అమెరికా అధ్యక్షుడికి సలహాదారు, అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ అన్నారు. ఐసీఎమ్మార్ నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కరోనా సంక్షోభవం ఎంత ప్రమాదకరంగా మారినప్పటికీ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో మనుష్యులకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రయోగాలు చేయకూడదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హ్యూమాన్ ట్రయల్స్‌లో మోడెర్నా, ఫైజర్ కంపెనీల వ్యాక్సిన్లు ముందున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో భారతదేశ ఉత్పాదకత సామర్థ్యం కీలకంగా మారనుంది. వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సాగాలి అని పేర్కొన్నారు.






