ఏపీలో కొత్తగా 9,742 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 57,685 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,742 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కు చేరింది. తాజాగా వైరస్ నుంచి 8,061 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా, 86 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆంధప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటివన్ విడుదల చేసింది. కాగా, రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 30,19,296 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.






