30 లక్షలు దాటిన కరోనా కేసులు
భారతదేశంలో గత 24 గంటల్లో 69,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 30,44,941కి పెరిగాయి. ఇందులో 7,07,688 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 22,80,567 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు కరోనా వైరస్‌తో కొత్తగా 912 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాలు 56,706కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో గత వారం రోజులుగా ప్రతిరోజు 9 వందల మందికిపైగా చనిపోతున్నారు. దీంతో కేవలం వారం రోజుల్లోనే (ఆగస్టు 16 నుంచి 22 వరకు) 5,814 మంది మృతి చెందారు. ఆగస్టు 19, అత్యధికంగా 1,092 మంది కరోనాతో మరణించారు.






