ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా నిర్థారణ పరీక్షలు
ఆంధప్రదేశ్‌లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి శాతం (రికవరీ రేటు) గణనీయంగా పెరుగుతోంది. తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం రికవరీ రేటులో జాతీయ సగటున ఆంధప్రదేశ్ అధిగమించింది. జాతీయ సగటు రికవరీ రేటు 77.30 శాతం మాత్రమే ఉండగా ఆందప్రదేశ్‌లో 79.10 శాతం ఉండటం శిశేషం. మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గి 0.89 శాతానికే పరిమితమైంది. రాష్ట్రంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఒకే రోజు 72,573 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 41,07,890కి చేరింది. ఆదివారం 10,794 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 70 మంది మృతి చెందారు. ఒకే రోజు 11,915 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 4,98,125 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 3,94,019 మంది కోలుకున్నారు. 99,689 మంది చికిత్స పొందుతుండగా 4,417 మంది మృతి చెందారు.






