ఏపీలో 3.50లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 61,469 మంది శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,45,216కి పెరిగింది. మొత్తం పరీక్షల సంఖ్య 31,91,326 కాగా.. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 97 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,189కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 1321, చిత్తూరులో 1220, పశ్చిమగోదావరిలో 1033, అనంతపురం జిల్లాలో 1020 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 24 గంటల్లో 8,593 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీనితో కలిపి మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,52,638కి చేరింది.






