బయోలాజికల్ ఈ సంస్థతో అమెరికా సంస్థ ఒప్పందం
కరోనా వ్యాక్సిన్ను ఏ దేశం కనుగొన్నా వాటిలో అత్యధికం హైదరాబాద్లో ఉత్పత్తి చేయాల్సిందేనని మరోసారి నిరూపితం కానున్నది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్ -ఈ సంస్థతో అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం చేసుకున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. బయోలాజికల్ -ఈ సంస్థకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ వ్యాక్సిన్ ఇండస్ట్రీ శక్తి సామర్థ్యాలు కరోనా వ్యాక్సిన్స్ ద్వారా మరోసారి ప్రపంచానికి నిరూపితం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.






