కరోనాకు బీసీజీతో చెక్!
క్షయ కట్టడికి వాడే బసిల్లస్ కాల్మెట్టె గెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్ కొవిడ్ 19 సోకకుండా కూడా సాయపడుతుందని అమెరికా పరిశోధకులు తెలిపారు. బీసీజీ టీకాను తప్పనిసరి చేసిన దేశాల్లో మహమ్మారి విరుచుకుపడిన తొలి 30 రోజుల్లో వైరస్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా సమూహం స్థాయిలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్టు గుర్తించామన్నారు. జాతీయ రోగనిరోధకత కార్యక్రమాల్లో భాగంగా చైనా, భారత్లో బీసీజీ టీకాను వేసే కార్యక్రమాలను విస్త•తంగా నిర్వహిస్తారని అందుకే ఆ దేశాల్లో కొవిడ్ 19 మరణాలు తక్కువగా నమోదు అవుతున్నట్టు పరిశోధకులు వివరించారు.






