ఏపీలో కొత్తగా 9999 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,137 శాంపిల్స్ పరీక్షించగా 9,999 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 77 మంది ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా మరో 11,069 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైనవాటిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1499 కేసులు రాగా, పశ్చిమగోదావరిలో 1081, చిత్తూరు జిల్లాలో 1040 చొప్పున కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 44,52,128 శాంపిల్స్ పరీక్షించగా 5,47,689 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 4,46,716 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 4779 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కడప జిల్లాలో తొమ్మిది మంది మృతి చెందగా, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఏడుగురు చొప్పున, అనంతపురం, విశాఖ జిల్లాలో ఆరుగురు చొప్పున, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు.






