దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం
భారత్లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96,551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1209 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 76,271కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,664కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,43,480గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.68 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.67 శాతానికి పడిపోయిందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,63,542 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు 5,40,97,975 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.






