ఏపీలో 9,544 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో మొత్తం 9,544 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. 55,010 కరోనా పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు నిర్ధారణ అయినట్లు అందులో పేర్కొన్నారు. కరోనాతో చికిత్స పొందుతున్న వారిలో ఈ ఒక్కరోజు వ్యవధిలో 91 మంది మృతి చెందారు. చిత్తూరులో 16, పశ్చిమగోదావరి 13, నెల్లూరు 12, తూర్పుగోదావరి 11, అనంతపురం 8, కడప 7, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 5, ప్రకాశం 4, గుంటూరు 3, కృష్ణా 3, కర్నూలులో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 3092కి చేరింది. గత 24 గంటల్లో 8,827 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.






